ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన

Mar 22 2026 2:09 AM | Updated on Mar 22 2026 2:09 AM

గంపలగూడెం: మండలంలోని మేడూరు గ్రామానికి చెందిన కోటేశ్వరి తనకున్న 50 సెంట్లలో వరి, మరో 1.7 ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుగచేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ శనివారం ఆ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి రైతూ రసాయన రహి తంగా పంటలు పండించాలని సూచించారు. అనంతరం తునికిపాడులో ఇటీవల వర్షాలకు నేలవాలిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. మొక్కజొన్న, పెసర తదితర పంటలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ప్రోడక్ట్‌ అథారిటీ చైర్మన్‌ సీహెచ్‌.దేవదత్తు, తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్‌, తహసీల్దార్‌ వి.రాజకుమారి, ఎంపీడీఓ టి.సరస్వతి, ఏఓ హారీష్‌రావు పాల్గొన్నారు.

నలుగురు సీఐలు బదిలీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ బి.హెచ్‌.వెంకటేశ్వర్లును సీసీఎస్‌కు, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్న డి.చంద్ర శేఖర్‌ను అజిత్‌సింగ్‌నగర్‌కు బదిలీ చేశారు. గుణదల సీఐ వి.శ్రీనును సైబర్‌ క్రైమ్‌కు, టూ ట్రాఫిక్‌ సీఐ వై.సత్యరమేష్‌ను గుణదల పీఎస్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

వెంకన్న దర్శనానికి

బారులు తీరిన భక్తులు

గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు క్యూల్లో బారులు తీరారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(మెయిల్‌) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆర్థిక సాయంతో ఈ అన్న సమారాధన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement