కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ

కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ

ఎ.కొండూరు: ఎలుకలు కొరికి గాయాలపాలైన ఎ.కొండూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులను వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ శుక్రవారం పరామర్శించారు. వసతి గృహంలో టీడీపీ నాయకులు ఉండటంతో పోలీసులు అవినాష్‌ను గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలసి ఆయన పాఠశాలలోని విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల డార్మెటరీలో నిద్రిస్తుండగా ఎలుకలు కరిచాయని విద్యార్థినులు అవినాష్‌కు తెలియజేశారు. మెనూ ప్రకారం భోజనం లేదని, ఆదివారం చికెన్‌ ఇవ్వట్లేదని కూడా తెలిపారు. దోమలు, ఎలుకల బాధతో అల్లాడుతున్నామని, కిటికీలకు మెష్‌లు కూడా లేవని తెలియజేశారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఉదాసీన వైఖరి అవలంబించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అవినాష్‌ వారికి హామీ ఇచ్చారు. పేద విద్యార్థినులకు రక్షణ కల్పించలేకపోవడం తగదని హితవు పలికారు.

పాఠశాలలో సమస్యలు

తెలుసుకున్న దేవినేని అవినాష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement