డల్లాస్‌లో తానా కళాశాల అభినందన

TANA Kalashala Facilitation Programme Held In Dallas - Sakshi

డల్లాస్, టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల' అభినందన కార్యక్రమం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు వచ్చారు. అనంతరం తానా కళాశాల చైర్మన్ డాక్టర్‌ రాజేష్ అడుసుమిల్లి, కో-చైర్ మాలతీ నాగభైరవలు కళాశాల కార్యక్రమాల గురించి వివరించారు. గత ఐదేళ్లుగా తానా సంస్థ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి  సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం, సంగీతం కోర్సులకి ఎనలేని స్పందన లభిస్తోందన్నారు., ఇప్పటికి దాదాపు 400 పైగా విద్యార్థులు ఈ కోర్సులో చేరి సరిఫికేట్స్ పొందారని తెలిపారు. తానా సహకారంతోనే ఈ కళాశాల  అభివృద్ధి సాధ్యపడిందన్నారు. 

తానా పూర్వాధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయం సలహా సహకారాలతో ఈ శిక్షణా తరగతులని అమెరికా అంతటా విస్తృతం చేయాలన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్‌ రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట మాట్లాడుతూ భారతీయ కళలు తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే దిశగా తానా పని చేస్తుందన్నారు. 

నృత్య, సంగీత గురువులు పద్మ శొంఠి, డాక్టర్‌ సుధా కలవగుంట, శ్రీలత సూరి, కల్యాణి ఆవుల, హేమ చావలి, సమీర శ్రీపాదలను తానా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అలాగే ఈ సమావేశానికి ఇండియా నుంచి వెళ్లిన ప్రొఫెసర్ డాక్టర్‌ హిమబిందుకి  జ్ఞాపిక బహూకరించి సత్కరించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, తానా ప్రతినిధులు మురళి వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, సాంబ దొడ్డ, నాగరాజు నలజుల, వెంకట్ ములుకుట్ల, లెనిన్ తుళ్లూరి, రాజా నల్లూరి, ప్రవీణ్ కొడాలి, రాజేష్ పోలవరపు, విజయ్ వల్లూరు, వెంకట్ తొట్టెంపూడి, చంద్ర రెడ్డి పోలీస్, ప్రమోద్ నూతేటి, పవన్ గంగాధర, దీప్తి సూర్యదేవర, మధుమతి వైశ్యరాజు, శ్రీదేవి ఘట్టమనేని, అరవింద జోస్యుల తదితరులు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top