న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన జస్టిస్‌ ఎన్వీ రమణ

Supreme Chief Justic NV Ramana at New Jersey Sri Sai Datta Peetham - Sakshi

ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు జస్టిస్‌ ఎన్వీ రమణ కు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు  రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

చదవండి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు: వైవీ సుబ్బారెడ్డి

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top