శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో తొలిసారి క్రీడా కార్యక్రమం | Sakshi
Sakshi News home page

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో తొలిసారి క్రీడా కార్యక్రమం

Published Wed, Jan 25 2023 9:28 PM

Sri Samskruthika Kala Saradhi Cricket Tournament Conducted In Singapore - Sakshi

గత రెండేళ్లుగా వైవిధ్యభరితమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ తొలిసారి సింగపూర్‌లో క్రీడారంగంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL) ని Terusan Recreation Centre లో జనవరి 22-24 వరకు ఘనంగా నిర్వహించింది.

మొత్తం 12 టీంలు లెవన్ టైగెర్స్, విక్టోరియన్స్ (మెగాయార్డ్), కూల్ ట్రంప్స్ (పెంజూరు), సెంబావాన్గ్ స్ట్రైకర్స్ (సెంబావాన్గ్), కెప్పెల్ సన్రై జర్స్ (అకాసియా లాడ్జ్), సింగపూర్ తెలంగాణ (వెస్ట్ కోస్ట్), కెన్టెక్ హాన్టెర్స్ (కెన్టెక్ లాడ్జి), రాయల్ గైస్ (కాకిబుకిత్), తెలుగు సూపర్ కింగ్స్ (సీడీపీల్/జేటీసీ), దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్), రోటరీ కోబ్రాస్ (TR), ట్రోఫీ ఫైటర్స్ ( Tuas View) పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో, ముత్యాల రమేష్ నాయకత్వంలో కూల్ ట్రంప్స్ (పెంజూరు) విజేతగా నిలవగా, చిన్నబోయిన రవి కుమార్ నాయకత్వంలో దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్) టీం ద్వితీయ, సంకాబత్తుల దుర్గ బాబు నాయకత్వంలో రాయల్ గైస్ (కాకిబుకిత్) టీం తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. మొదటి బహుమతిగా 500 డాలర్లు, ద్వితీయ బహుమతిగా 300 డాలర్లు, తృతీయ బహుమతిగా 200 డాలర్లతో పాటు ట్రోఫీని విజేతలకు అందచేశారు.

సీడీ దిలీప్ వరప్రసాద్ ‘మాన్ అఫ్ ది మ్యాచ్’ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ గా మహేశ్వరన్ సూర్య ప్రకాష్, బెస్ట్ క్యాచ్‌కు పందాల జైరాం నాయుడు ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ కి అంపైర్‌గా శ్రీనివాస్ యాదవ్, సంగటి చంద్ర మోహన్ రెడ్డి వ్యవహరించారు. గిరిధర్ సారాయి నాయకత్వంలో జరిగిన ఈ కార్యాక్రమములో నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, S కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులతో పాటు అనేకమంది వాలంటీర్స్ వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరితో పాటు తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడప, వారి సభ్యులు నీలం మహేందర్. గారెపల్లి శ్రీనివాస్, SP Sysnet కొల్లా శివప్రసాద్ తదితరులు విచ్చేసి నిర్వాహుకులను, క్రీడాకారులను అభినందించారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావటం పట్ల హర్షం ప్రకటిస్తూ, దానికి సహకరించిన Terusan Recreation Centre యాజమాన్యానికి, వాలంటీర్స్, ఆర్ధిక సహాయం అందించిన సరిగమ బిస్ట్ర రెస్టారంట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, SP Sysnet, టింకర్ టాట్స్ మొంటోసిరి, శబ్ద కాన్సెప్ట్స్, శంకర్ వీర, బాలకృష్ణ, సుబ్బు వి పాలకుర్తి లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement