ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు | Sakshi
Sakshi News home page

ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు

Published Wed, May 11 2022 12:24 AM

Padma Vibhushan Dr KJ Yesudas On Ghantasala - Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 100 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 8 మే 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గొప్ప గాయకుడు, మానవతావాది, కళాకారులు అని చెపుతూ.. మా చిన్ననాటి రోజుల్లో దేవదాసు సినిమా పాటలు విని పెరిగానని, ముఖ్యంగా ఘంటసాల పాడిన శాంతినివాసం సినిమా మలయాళంలో అనువాదం అయినప్పుడు ఆ సినిమాకి ఘంటసాల తెలుగులో పాడిన తెలుగు పాటకు నేను మలయాళంలో పాడటం అది నా కెరీర్ లో రెండవ సినిమా అవడం చాలా అదృష్టమని తెలిపారు..

తన కెరీర్ ప్రారంభంలో ఘంటసాల గారితో కలసి పాడటం అప్పుడు వారి నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకోవడం అది తన అదృష్టం మరియు దైవ సంకల్పం అని చెప్పారు... అలాగే ఘంటసాల తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన అక్కినేని నాగేశ్వర రావు గారి సినిమాలకు కొన్ని పాటలు పాడటం, మేఘసందేశం సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం లభించడం నా అదృష్టమని తెలిపారు. ఘంటసాల గొప్ప గాయకుడు అని చెపుతూ ఈ కాలం గాయకులలో 100 కు 99 మంది  వారిని ఆదర్శంగా తీసుకొని గాయకులుగా  రాణిస్తారని, ఇదే విషయాన్నీ SPB బాలు ఎప్పుడు చెపుతుండేవారిని ఈ సందర్భంగా బాలుని కూడా నెమరువేసుకున్నారు... వారి ఆలపించిన భగవద్గీత ఇప్పటికి మనందరి మదిలో ఉంటుందని... నేను ఇప్పటికి భగవద్గీతని పూర్తి గా ఆలపించలేపకపోయానని  కానీ ఘంటసాల అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగారని తెలిపారు.

దక్షిణ భారత గాయకులు అందరికి ఎంత గొప్ప గౌరవం ఉందొ ఉత్తరాది గాయకులు అయిన లతా మంగేష్కర్, మహమ్మద్ రవి వంటి గాయకులు కూడా అంతే గౌరవం ఘంటసాల గారి మీద చూపే వారని తెలుపుతూ రెండు పాటల పల్లవులను  పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు... ఘంటసాల భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులు అని తెలియచేస్తూ తన పూర్తి మద్దతుని తెలియచేసారు...  చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.. వారు మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు.
 

యు.యెస్.ఏ నుండి చైర్మన్, గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యు.యెస్.ఏ ప్రవాసీ భారతీయ సమ్మాన్, సుబాష్ రజ్దాన్ , FACC డైరెక్టర్, GAPI వాలంటీర్ క్లినిక్ డా. శ్రీని గంగసాని M.D, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు వంశి కృష్ణ ఇరువరం, మలేషియా నుండి  మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్, సింగపూర్ నుండి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, స్కాట్లాండ్ నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, UK అధ్యక్షుడు శివ చింపిరి, నైజీరియా నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడు మూగలమర్రి లోకనాథరెడ్డి, స్విట్జర్లాండ్ నుండి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గని కడలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ,  పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలపడం ఒక గొప్ప శుభపరిణామనని, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి తోడ్పాటు అందించిందని తెలియచేస్తూ, ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అందరు ముక్త కంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని  తెలిపారు. 

 

ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల  సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 103 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు మీ అందరికోసం:

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement