Indian Origin Mohinder K Midha UK First Dalit Woman Mayor in London - Sakshi
Sakshi News home page

London Dalit Mayor: లండన్‌లో తొలి దళిత మేయర్‌గా భారత సంతతి మొహిందర్‌ కె.మిధా

May 26 2022 8:34 AM | Updated on May 26 2022 9:51 AM

Indian Origin Mohinder K Midha UK First Dalit Woman Mayor - Sakshi

భారత సంతతికి చెందిన నాయకురాలు యూకేలో అరుదైన ఘనత సాధించారు. యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌.. 

లండన్‌: భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. తద్వారా యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు.

మొహిందర్‌ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమనియూకేలోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌’ చైర్మన్‌ సంతోష్‌దాస్‌ చెప్పారు.

మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధాను 2022-23 తదుపరి ఏడాది కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement