అమెరికా ప్రవాసీ అనిల్‌ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు | Friends Fans give a Hearty Welcome To NRI Anil Bodireddy in Hyderabad Airport | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రవాసీ అనిల్‌ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు

Nov 28 2021 2:45 PM | Updated on Nov 28 2021 2:46 PM

Friends Fans give a Hearty Welcome To NRI Anil Bodireddy in Hyderabad Airport - Sakshi

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ అనిల్‌ బోదిరెడ్డికి నవంబర్ 28 నాడు తెల్లవారుజామున హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు, మిత్రులు స్వాగతం పలికారు. అనిల్‌ బోదిరెడ్డి ప్రస్తుతం 'ఆటా' వేడుకలకు కో-చైర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో అమెరికాలోని గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ(GATES) చైర్‌గా, ఇండియన్‌ ఫ్రెండ్స్‌ అఫ్‌ అట్లాంటా చైర్‌గా సేవలందించారు.

సౌత్‌ ఆఫ్రికాలోని గాటెంగ్‌లో 'గ్రోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(GOPIO)' కార్యదర్శి వీ లక్ష్మణ్ రెడ్డి, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న 'కోయలిషన్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ తెలంగాణ అసోసియేషన్స్‌(COTA)' (ప్రవాసీ తెలంగాణ సంఘాల విశ్వవేదిక) చైర్మన్‌ ముళ్ళపూడి వెంకట అమ్రీత్‌లు అనిల్‌ బోదిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement