డొంకేశ్వర్(ఆర్మూర్): నూతన పుష్కర ఘాట్ల ఏర్పాటు కోసం దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు బుధవారం డొంకేశ్వర్ మండలంలో పర్యటించారు. నికాల్పూర్తోపాటు అన్నారం, చిన్నయానం, మారంపల్లి, డొంకేశ్వర్ ప్రాంతాల్లో గోదావరి తీరాన్ని పరిశీలించారు. మండలంలో ఇటీవల ఐదు చోట్ల పుష్కర ఘాట్ల కోసం ఇరిగేఫషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు స్థలాలను పరిశీలించారు. పుష్కర ఘాట్ల మంజూరు కోసం ప్రభుత్వ కమిటీకి నివేదిస్తామని వారు తెలిపారు. ఇరిగేషన్ డీఈ, ఏఈ రాజ్ కమల్, గ్రామస్తులు, సుభాష్, సుమన్, సుధాకర్ ఉన్నారు.


