వర్ని: పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పడకల ఆస్పత్రిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. రూ.20 కోట్లతో వర్ని మండల కేంద్రంలో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని పోచారం బుధవారం ప్రారంభించారు. సాధారణ చికిత్సతోపాటు డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా స్థానికంగా అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని పోచారం అన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, నాయకులు గోపాల్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


