పశు ఎముకలతో నూనె తయారీ | - | Sakshi
Sakshi News home page

పశు ఎముకలతో నూనె తయారీ

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● బోధన్‌లో వెలుగు చూసిన ఘటన

● 900 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం

బోధన్‌టౌన్‌(బోధన్‌): పశువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్న ఘటన బోధన్‌ పట్టణంలో బుధవారం వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీలో ఓ ఇంటిపై చీతా టీముతోపాటు స్థానిక పోలీసులు దాడి చేశారు. పశువుల కొవ్వుతోపాటు ఎముకలు, తోళ్లతో నూనె తయారు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 900 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకుని, మహ్మద్‌ నఫీఉద్దీన్‌, మహ్మద్‌ సోఫిఉద్దీన్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చీతా టీమ్‌ ఎస్సై శ్రీను, స్థానిక ఎస్సై రామ్‌ తెలిపారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement