నిరంతర విద్యుత్‌ సరఫరా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరా లక్ష్యం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● టీజీఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌

(ఆపరేషన్స్‌) మధుసూదన్‌

● జిల్లాలోని పలు సబ్‌స్టేషన్‌ల పరిశీలన

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): విద్యుత్‌ వ్యవస్థలో సమస్యలను ముందుగానే గుర్తించి, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యమని తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డి స్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఎన్‌పీడీసీఎల్‌) డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) మధుసూదన్‌ పేర్కొన్నారు. జీఎం బాబురావు, ఎస్‌ఈ రాజేశ్వరరావుతో కలిసి బుధవారం డిచ్‌పల్లి, సిరికొండ, భీంగల్‌, పోచంపాడ్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను మధుసూదన్‌ సందర్శించారు. డిచ్‌పల్లిలోని 220/132/33, సిరికొండలోని 132/33, భీమ్‌గల్‌లోని 220 కేవీ, పోచంపాడ్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లను పరిశీలించి విద్యుత్‌ సరఫరా వివరాలు తెలుసుకున్నారు. 33 కేవీ ఫీడర్‌లపై విద్యుత్‌ లోడ్‌, 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్‌ఎస్‌) లోడింగ్‌ ను సమీక్షించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పనితీరును పరిశీలించి, గ్రిడ్‌ స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఎన్‌పీడీసీఎల్‌ జీఎం బాబురావు, ఎస్‌ఈ ఎన్‌పీడీసీఎల్‌ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఈ ట్రాన్స్‌కో ఆరోగ్యరాజు, డిచ్‌పల్లి డీఈ హరిచంద్‌, ఆర్మూర్‌ డీఈ రఘు, ఆపరేషన్స్‌ ఏడీఈలు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement