రుద్రూర్: పోతంగల్ మండలం హంగర్గా గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగారాం పనితీరుపై పాలకవర్గ సభ్యులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. పాలకవర్గ తీర్మానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కార్యదర్శిని కార్యాలయంలో నిర్బంధించి, జీపీకి తాళం వేశారు. గతంలోనూ కార్యదర్శి వ్యవహారశైలిపై మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోలేదని పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చే వరకు తాళం తీయబోమని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎంపీడీవో చందర్ నాయక్ శిక్షణలో ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కార్యదర్శుల సంఘం ప్రతినిధులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం జీపీ రికార్డులను బీరువాలో భద్రపరిచి సీల్ వేశారు.
మొరాయించిన
డిచ్‌పల్లి రైల్వేగేట్
డిచ్‌పల్లి: మండల కేంద్రం నుంచి ఘన్‌పూర్ మార్గంలో ఉన్న రైల్వేగేట్ (ఎలక్ట్రికల్) మంగళవారం సాయంత్రం మొరాయించింది. రైలు వచ్చే ముందు సిబ్బంది గేటు వేశారు. అయితే రైలు వెళ్లిన తర్వాత సాంకేతిక లోపంతో గేటు పైకి లేవలేదు. దీంతో సుమారు 40 నిమిషాలపాటు గేటుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టారు. సుమారు అరగంట పాటు శ్రమించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు.
18న ఫుట్‌బాల్
టాలెంట్ హంట్
కామారెడ్డి అర్బన్: నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో ఈనెల 18న ఫుట్‌బాల్ క్రీడాకారుల టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధి కారి రంగా వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్‌ల ఆధ్వర్యంలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడానికి ఈ కార్య క్రమం చేపట్టామని పేర్కొన్నారు. పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు హాజరు కావాలని సూచించారు.
డీఈవో కోసం ఉపాధ్యాయ సంఘాల భేటీ?
ఖలీల్‌వాడి: జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌కు మద్దతుగా నిలవాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో ఇటీవల ఆయా సంఘాల ముఖ్య నాయకులు భేటీ అయి డీఈవో వ్యవహారంపై రెండు గంటలపాటు చర్చించినట్లు తెలిసింది. తన పరిధిలోని అంశాలపై డీఈవో సత్వర నిర్ణయాలు తీసుకోకపోవడం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులకు 110 మంది టీచర్లను ఎంపిక చేయడం చర్చకు దారి తీయగా.. గత సంఘటనలను వదిలి ముందుకు ఎలా వెళ్లాలనేదానిపై చర్చించాలని పలువురు నాయకులు సూచించినట్లు సమాచారం. చి వరకు అంతా కలిసి డీఈవోకు మద్దతు పల కాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో డీఈవోకు సన్నిహితంగా ఉన్న ఓ నేత విధు ల్లో చేరాలని ఆయనను కోరగా, డీఈవో నుంచి స్పష్టమైన సమాధానం రానట్లు స మాచారం. డీఈవో తిరిగి విధుల్లో చేరిన వెంటనే కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి మాట్లాడా లని ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.


