నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని గీతా కాన్వెట్ పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్ బాలికల ఖోఖో జట్టుకు నిర్వహించిన శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. ఇటీవల నిర్వహించిన జిల్లా జట్టు ఎంపికలో ప్రతిభ కనబర్చిన 30 మంది క్రీడాకారిణులకు పీడీ సుజాత, పీఈటీలు ఆస్మాబేగం, ఎస్ గంగారెడ్డి, ముత్యం ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించారు. హైదరాబాద్‌లో ఈనెల 15, 16, 17 తేదీల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారిణులు పాల్గొననున్నారు. సర్పంచు ఎర్రం లింగం, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి అతీకుల్లా, మధుసూదన్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ గంగాసాగర్, ప్రిన్సిపాల్ గంగభూషణ్, అశోక్, లింగం, నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


