సీఎం రేవంత్‌తో జిల్లా నేతల భేటీ | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌తో జిల్లా నేతల భేటీ

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

● ఢిల్లీలోని నివాసంలో సమావేశం

● పార్టీ కార్యకలాపాలపై చర్చ

డిచ్‌పల్లి: సీఎం రేవంత్‌రెడ్డితో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకు లు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందు కు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమావేశమయ్యారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సునీల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement