నేటి నుంచి రైల్వే కమాన్‌ మూసివేత | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైల్వే కమాన్‌ మూసివేత

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

● మరమ్మతుల నేపథ్యంలో 45

రోజులపాటు వాహనాల మళ్లింపు

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని రైల్వే కమా న్‌ వద్ద దక్షిణ మధ్య రైల్వే డబుల్‌ ట్రాక్‌ పను లు ప్రారంభిస్తుండడంతో బుధవారం నుంచి అండర్‌పాస్‌ రహదారి మూసివేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 45 రోజుల వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.

నగరంలోకి వచ్చే వాహనాలు..

ఆర్మూర్‌, నిర్మల్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ నగరంలోకి వచ్చే వాహనాలు నేరుగా పాత దారి వెంబడే.. కంఠేశ్వర్‌ బైపాస్‌, మీ సేవ (కంఠేశ్వర్‌) మీదుగా ఎన్టీఆర్‌ చౌరస్తా చేరుకొని అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌ ముందు నుంచి నుంచి బస్టాండ్‌ చేరుకోవాలి.

హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు..

హైదరాబాద్‌, కామారెడ్డి వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్‌ చౌరస్తా, కోర్ట్‌ చౌరస్తా, పులాంగ్‌ చౌరస్తా నుంచి మాధవనగర్‌ రైల్వేగేట్‌ దాటుతూ హైదరాబాద్‌ రోడ్డుకు చేరుకోవాలి. బోధన్‌, బాన్సువాడ, వర్ని వెళ్లే వాహనాలు యథావిధిగా పాత మార్గంలోనే ప్రయాణం సాగించాలి.

ఆర్మూర్‌, కరీంనగర్‌ వైపు..

నిజామాబాద్‌ బస్టాండ్‌ నుంచి ఆర్మూర్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, నిర్మల్‌ వెళ్లే వాహనాలు దేవీ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్‌ మీదుగా దుబ్బ శివాజీ విగ్రహం నుంచి దుబ్బ చౌరస్తా మహాలక్ష్మి టెంపుల్‌ వద్ద ఎడమ వైపు తిరిగి ఖానాపూర్‌ చౌరస్తాకు చేరుకోవాలి. (మహాలక్ష్మి మందిరం దుబ్బ చౌరస్తా నుంచి నేరుగా జీజీ కళాశాల వరకు వెళ్లి బైపాస్‌ చేరుకోవచ్చు) బైపాస్‌ మీదుగా కంఠేశ్వర్‌ డీఎస్‌ చౌరస్తాకు చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement