గడువులోగా పుష్కరాల పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పుష్కరాల పనులు పూర్తిచేయాలి

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

రెంజల్‌: నిర్ణీత గడువులోగ గోదావరి పుష్కరాల ప నులను పూర్తిచేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులకు సూచించారు. కందకుర్తి గోదావరి ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో ప్రస్తుతం వీఐపీ ఘాట్‌తోపాటు ఒడ్డున కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం కారణంగా ఇరిగేషన్‌ శాఖ అధ్వర్యంలో చేపట్టాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోందని.. సంబంధిత అధికారులు వివరించగా నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులను ప్రారంభించి మార్చి చివరి వరకు పూర్తి చేయించాలని ఆదేశించారు. పనుల ప్రగతితోపాటు నాణ్యతను పరిశీలించేందుకు వారానికి రెండు రోజులు ప ర్యవేక్షణ చేయాలని ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు సూ చించారు. అప్రోచ్‌రోడ్లు, కల్వర్టుల నిర్మాణం వంటి పనులను ఏకకాలంలో జరిగేలా చూడాలన్నారు. అలాగే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గోదావరి తీరా న కొనసాగుతున్న పనులను ముమ్మరం చేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఆర్డీవో విజయకుమారి, కందకుర్తి సర్పంచ్‌ గయాసుద్దీన్‌తోపాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

యంచలో..

నవీపేట : మండలంలోని యంచ గోదావరి తీరాన పుష్కర ఘాట్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పుష్కరఘాట్‌ పనులను అదనపు కలెక్టర్‌ భుజంగరావుతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌లు వెంకటరమణ, శ్రావణ్‌, సర్పంచ్‌ బేగరి సాయిలు, వీడీసీ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement