నిజామాబాద్‌అర్బన్: ఉద్యమకారులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘పదేళ్ల పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ కారులతోపాటు అమరవీరుల కుటుంబాలను ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డితోపాటు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ తదితరులు ప్రసంగించా రు. కేసీఆర్ నాయకత్వంలోని పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జిల్లా వాసి అయినప్పటికీ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం సిగ్గుచేటన్నారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ ఎంపీపీ సుమన రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


