నిజామాబాద్‌అర్బన్: రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు, విక్రయాలు చేపట్టాలని సీపీ సాయి చైతన్య అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో రైస్ మిల్లుల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం కా రణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడం, పంటల సాగు, దిగుబడులపై ప్రతి కూల ప్రభావం పడే అవకాశాలు ఉండటంతో ప్రస్తు త వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, వర్తించే ధరల మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు, విక్రయాలు చేపట్టాలన్నారు. ప్రజలకు అవసరమైన బియ్యం అందుబాటులో ఉండేలా, ధరల విషయంలో సా మాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా సహకరించాలని కోరారు. అదనపు డీసీపీ ఎన్ శుభంప్రకాశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


