ఏఐసీఎస్‌ రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా రాణి | - | Sakshi
Sakshi News home page

ఏఐసీఎస్‌ రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా రాణి

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

ఆర్మూర్‌ : ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌(ఏఐసీఎస్‌) తెలంగాణ హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పీ రాణి ఎంపికయ్యారు. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో రాణి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈనెల 7,8 తేదీల్లో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో రాష్ట్ర జట్టు కోసం ఎంపిక పోటీలు నిర్వహించగా జిల్లాకు చెందిన రాణితోపాటు జీ వర్ష, జీ ఇంద్ర, వీ భారతి తదితరులకు చోటు లభించింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ రాణి మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రాక్టీస్‌ చేస్తున్నామన్నారు. హాకీలో జట్టులో ని క్రీడాకారుల మధ్య సమన్వయం, క్రమశిక్షణ, పట్టుదల, సమయస్ఫూర్తి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

‘కాంగ్రెస్‌ తెచ్చిన

కరువు ఇది..’

కమ్మర్‌పల్లి: రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, పూర్తిగా కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేని విధానాల కారణంగా వచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి స్థానిక మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా కేవలం 13 సెంటీమీటర్ల లోటు మాత్రమే నమోదైందని, అంతమాత్రానికే తీవ్ర కరువు పరిస్థితు లు దాపురించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజె క్టులో ప్రస్తుతం సుమారు 46 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుత దశలో కేవలం 3 టీఎంసీల నీటిని విడుదల చేసి లి ఫ్ట్‌లను నడిపిస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లోని పంటలన్నీ చేతికొచ్చి రైతాంగం గట్టెక్కుతుందన్నారు. జిల్లాకు మంత్రి అనుకుంటున్న ప్రభుత్వ సహాదారు సుదర్శన్‌రెడ్డితోపాటు యంత్రాంగం తక్షణమే లిఫ్ట్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.

అమ్మవారికి సేవ చేయడం అదృష్టం

సుభాష్‌నగర్‌: దుర్గామాతకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ధన్‌పాల్‌ లక్ష్మీ బాయివిఠల్‌గుప్తా చారిటబుల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్లు ఉదయ్‌కుమార్‌, ప్రణయ్‌కుమార్‌, డాక్టర్‌ వినయ్‌కుమార్‌ అన్నారు. నవరాత్రి ఉత్సవా ల నేపథ్యంలో అమ్మవారి మండపాల నిర్వాహకులకు నగరంలోని మిర్చి కంపౌండ్‌లో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ డైరెక్టర్లు మాట్లాడుతూ.. అనేక సేవా కార్యక్రమా లు చేపడుతున్నామని, ఇందులో భాగంగా పదేళ్లుగా అమ్మవారి మండపాలకు పట్టుచీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందూరు నియోజకవర్గంలోని ప్రతి మండపానికి త మ వంతు సహకారంగా చీరలను అందజేస్తున్నామన్నారు. లోకమాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగోల్ల లక్ష్మీనారాయ ణ, కార్పొరేటర్లు మఠం పవన్‌, బంటు రా ము, మల్కాయి మహేందర్‌, బంటు ప్రీతిప్రవీణ్‌, ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి, జ్యోతి మురళి, ధాత్రిక పరమేశ్వర్‌, నాయకులు పవన్‌ ముందడ, మారావార్‌ కృష్ణ, శ్రీనివాస్‌, బాబీసింగ్‌, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement