వర్ని: వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఇతర రాష్ట్రాల వ్యా పారస్తులను బెదిరిస్తున్న స్థానిక వ్యాపారస్తులను నియంత్రించాలని, అవసరమైతే వారిపై కేసులు నమో దు చేయాలని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీపీ సాయిచైతన్యకు సూచించారు. వర్ని మండలంలోని సిద్ధాపూర్‌లో వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఫోన్‌లో సీపీతో మాట్లాడారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు క్వింటాలుకు రూ.4 వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటే స్థానిక వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని సీపీకి వివరించారు. కాగా, సిండికేట్ వ్యాపారుల వివరాలు అందజేస్తే వారితో తగిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.


