‘మత్తు’పై ఉక్కుపాదం మోపాలి | - | Sakshi
Sakshi News home page

‘మత్తు’పై ఉక్కుపాదం మోపాలి

Oct 8 2026 3:48 AM | Updated on Oct 8 2026 3:48 AM

● రవాణా, విక్రయాలను నిరోధించాలి

● ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో బుధ వారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి ఎకై ్సజ్‌ తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు సమీక్ష జరిపారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకొని, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో పల్లెల్లో గు డుంబా, నాటుసారా విక్రయాలు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోందని, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే మ త్తు పదార్థాల నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్న గంజాయి విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎకై ్సజ్‌ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. కల్తీకల్లు విక్రయాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడైనా కల్తీ కల్లు కారణంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే అందుకు ఎకై ్సజ్‌ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మా ట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా, విక్రయం, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీ సు శాఖ సహకారం తీసుకోవాలని, మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలోపు సిగరెట్లు, గుట్కా విక్రయాలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి గీత, ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీధర్‌, సూపరింటెండెంట్‌ నందగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement