సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్–1, నిజామాబాద్–2, బోధన్, ఆర్మూర్ డిపోలు న్నాయి. ఆరు డిపోలతో పాటు రీజియన్ కార్యాల యంలో కలిపి మొత్తం 1,894 మంది ఓటర్లున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణ వర్కర్స్ యూనియన్, స్టేట్ వర్కర్స్ యూనియన్‌లు మరో కూటమిగా బరిలో నిలిచాయి. తెలంగాణ వర్కర్స్ యూనియన్, స్టేట్ వర్కర్స్ యూనియన్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ నేతలు ఆయా డి పోల పరిధిలో కార్మికులతో మంతనాలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం అవడానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు, ఆర్థిక పరమైన అన్ని సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్‌లతో ఎంప్లాయీస్ యూని యన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు కలిపి కూటమిగా బరిలో దిగాయి. కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.
పక్షం రోజులుగా..
ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆయా కూటములు గెలుపుకోసం సుమారు పక్షం రోజులపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. కార్మికుల మద్దతు కోసం ఇరు కూటములు ప్రయత్నించాయి. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించడమే ఎ న్నికల్లో కీలకాంశంగా మారింది. విలీన ప్ర క్రియ పూర్తి చేయ డం తమతోనే సాధ్య మంటూ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూ నియన్, స్టేట్ వర్క ర్స్ యూనియన్‌ల కూటమి నేతలు కా ర్మికుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమి నేతలు కార్మికులను కోరారు. శుక్రవారం ఉదయం 5 నుంచి సా యంత్రం 6 గంటల వరకు అన్ని డిపోలలో పోలింగ్ నిర్వహించనున్నారు. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఉంటుంది. కార్మికులు ఎవరికి మద్దతుగా నిలిచారో ఈనెల 17న తేలిపోనుంది.
రీజియన్ పరిధిలో ఓట్ల వివరాలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికలు కీలక దశకు చేరాయి. ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార గడువు బుధవారంతో ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోలున్నాయి. ఆయా డిపోల పరిధిలో అధికారులు పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
కీలక దశకు చేరిన ఎన్నికలు
రెండు కూటముల మధ్య
హోరాహోరీ పోరు
ముగిసిన ఎన్నికల ప్రచారం
రేపే పోలింగ్


