సకాలంలో స్పందిస్తేనే మేలు | - | Sakshi
Sakshi News home page

సకాలంలో స్పందిస్తేనే మేలు

Oct 8 2026 3:48 AM | Updated on Oct 8 2026 3:48 AM

● సీపీ సాయిచైతన్య

నిజామాబాద్‌ అర్బన్‌: గోల్డెన్‌ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం పోలీసులు, 108 సిబ్బంది, ఆస్పత్రుల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దం జరిగిన వెంటనే ప్రతి నిమిషం ఎంతో విలువైనదన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సకాలంలో ప్రాథమిక వైద్యం అందించడం, అంబులెన్స్‌ను సమకూర్చడం, అవసరమైతే ఫైర్‌ సర్వీస్‌ సహాయంతో బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, ఆలస్యం లేకుండా ఆస్పత్రికి తరలించడం వంటి చర్యలు సమన్వయంతో జరగాలని సూచించారు. ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్య సిబ్బంది కూడా రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌అలీ, సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌, ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement