ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం ఎంవీఐ రాహుల్ కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. ఆటోలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ.. ఆటోలో ముగ్గురికి మించి పిల్లలను ఎక్కించొద్దని, వాహనదారులు సీట్ బెల్టు ధరించడంతోపాటు స్పీడ్ లిమిట్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఏఎంవీఐ రోహిత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాఘవపల్లి శివారులో బుధవారం రాత్రి అక్రమంగా మొరం తవ్వకం పనులు చేపట్టిన జేసీబీ, ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మొరం తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి జేసీబీని, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామని చెప్పారు.


