క్రీడాకారునికి కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారునికి కలెక్టర్‌ అభినందన

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

క్రీడాకారునికి కలెక్టర్‌ అభినందన మహిళా రైతులకు మాంస ఉత్పత్తులపై శిక్షణ

నిజామాబాద్‌ అర్బన్‌: బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు అనిల్‌ కుమార్‌ను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సోమవారం అభినందించారు. ఫిబ్రవ రి 28వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మ లేసియా దేశంలో జరిగిన ఇండియా–మలేషి యా అంతర్జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ లో పాల్గొన్న అనిల్‌కుమార్‌ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను మ ర్యాదపూర్వకంగా కలవగా అభినందించారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్‌ కుమా ర్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం బాధ్యులు శ్రావణ్‌ రెడ్డి, విద్యాసాగర్‌ రెడ్డి, శ్యామ్‌, రాజేశ్‌, రమణ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రుద్రూర్‌: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాలలో మహిళా రైతులకు మాంసం, మాంస ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్‌–ఎన్‌ఎంఆర్‌ఐ డైరెక్టర్‌ డా. ఎస్‌బీ బర్బుద్దే, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డా. బస్వా రెడ్డి మాట్లాడుతూ మహిళా రైతులు శిక్షణ ద్వారా లభించే పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ వెంకట్‌ రెడ్డి, కోఆర్డినేటర్లు శ్రీలత, అమల, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో

క్షుద్రపూజల కలకలం

డొంకేశ్వర్‌ మండలం

దత్తాపూర్‌లో ఘటన

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రభుత్వ పాఠశాల లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డొంకేశ్వర్‌ మండలం దత్తాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. సోమవారం పాఠశాలను తెరువగా వరండాలో పసుపు, కుంకుమతో వేసిన ఆకారం, వేపాకులు అందులో కత్తి వంటి వస్తువు కనిపించింది. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు భయపడగా, తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపలేదు. సమాచారం అందుకున్న సర్పంచ్‌ మూడ్‌ ప్రకాశ్‌ గ్రామ పంచాయతీ సిబ్బందితో వరండాను నీటితో శుభ్రం చేయించారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని అవగాహన కల్పించారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement