త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

సుభాష్‌నగర్‌: జర్నలిస్టుల చిరకాల వాంఛ ఇళ్ల స్థలా ల విషయమై కలెక్టర్‌, అధికారులతో సమావేశమై త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బస్వాగార్డెన్‌లో ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవ ర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తోపాటు ప్ర భుత్వ సలహాదారులు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, అర్బన్‌ ఎమ్మె ల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, వెల్‌నెస్‌ ఆస్పత్రి ఎండీ అసద్‌ ఖాన్‌, డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్‌ కార్యవర్గంతో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వెల్‌నెస్‌ ఆస్పత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా వైద్యం అందించేలా రూపొందించిన ఐడీ కార్డులను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అసద్‌ఖాన్‌, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్‌, డాక్టర్‌ వాగ్మారే సుభాష్‌, కోశాధికారి రాజ్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రాజు, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లు, సీనియర్‌ జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి

కట్టుబడి ఉంటాం..

ప్రజాస్వామ్య వ్యవస్థలో

పాత్రికేయుల పాత్ర కీలకం

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ

బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement