గర్భిణుల వివరాలను నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణుల వివరాలను నమోదు చేయాలి

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

సుభాష్‌నగర్‌: గర్భిణుల పేర్లను 12 వారాల్లోగా పకడ్బందీగా నమోదు చేయాలని డీఎంహెచ్‌వో బి రాజశ్రీ సూచించారు. గర్భిణుల నమోదు తక్కువగా ఉన్న పీహెచ్‌సీల సిబ్బందితో సోమవారం నగరంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్రతిరోజూ ఇళ్లను సందర్శించి రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని, పూర్తి వివరాలు సేకరించడం ద్వారా రిపోర్టులు చేయడం సులువవుతుందన్నారు. సమావేశంలో ఎంసీహెచ్‌ ప్రోగాం అధికారి డాక్టర్‌ శ్వేత, డాక్టర్‌ వెంకన్న, నారాయణ, శ్రీనివాస్‌, ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, రాము, ఎడపల్లి, సాలూరా, పెగడాపల్లి, డొంకేశ్వర్‌, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌ పీహెచ్‌సీల ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement