డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నికాల్‌పూర్ గ్రామంలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’ దినపత్రిలో వచ్చిన ‘పుణ్య స్నానాల గంగ’ కథనాన్ని వినతిపత్రానికి జోడించి ఇచ్చారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉందని, ఇక్కడి వరకు రోడ్డు సౌకర్యం ఉందన్నారు. పుణ్యస్నానాలకు నికాల్‌పూర్‌లో గంగకు ప్రసిద్ధి ఉందని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. 2027లో ప్రభుత్వం నిర్వహించే పుష్కరాలకు నికాల్‌పూర్ చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఘాట్ నిర్మించి పుష్కరాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అనితాసుమన్, ఉప సర్పంచ్ నీరజసుధాకర్, వీడీసీ సభ్యులు నవీన్, ముత్యం ఉన్నారు.


