నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 103 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణిలకు వివరించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


