నాసిరకం సామగ్రితో తెయూలో వంటలు
తెయూ(డిచ్‌పల్లి): నాసిరకం సామగ్రితో వంటలు చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. మెస్‌లో నాసిరకం వస్తువులతో వంటలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకు ఉపయోగించే సరుకులను హాస్టల్ బయట పారబోసి నిరసన తెలిపారు. గుట్టుచప్పుడుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని, వార్డెన్, కేర్‌టేకర్లతోపాటు చాలా మంది పాత్రధారులు ఉన్నారని విద్యార్థులు ఆరోపించారు. వార్డెన్, కేర్ టేకర్ కొంతమంది విద్యార్థులతో చేతులు కలిపి హాస్టల్‌కు సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టర్‌తో కుమ్మకై నాసిరకం వస్తువులు, గడువు తేదీ ముగిసిన సరుకులు వాడుతున్నారని మండిపడ్డారు. వర్సిటీ అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, వార్డెన్, కేర్‌టేకర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
నేడు రైఫిల్ షూటింగ్ ఎంపికలు
నిజామాబాద్ నాగారం: స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం రైఫిల్ షూటింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి నాగమణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని బోధన్ రోడ్‌లో ఉన్న ట్రస్ట్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఫుట్‌బాల్ కోచ్ నాగరాజుకు అన్‌సంగ్ గురు అవార్డు
నిజామాబాద్‌నాగారం: గ్రాస్‌రూట్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడంలో, భార త ఫుట్‌బాల్ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో చేసిన కృషికి జిల్లాకు చెందిన కోచ్ గొట్టిపాటి నాగరాజు అన్‌సంగ్ గురు అవార్డు అందుకున్నారు. ఆదివారం కోల్‌కతాలో భారత ఫుట్‌బాల్ సమాఖ్య నాగరాజుకు అవార్డును అందజేసింది. ఫుట్‌బాల్‌పై అంకితభావం, క్రీడాకారుల కోసం చేసిన కృషికి గాను గొట్టిపాటి నాగరాజుకు ఈ అవార్డు లభించింది. నాగరాజును జిల్లాకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులు, ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.


