నవనాథ గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం
ఆర్మూర్: సిద్ధేశ్వరుడు కొలువైన, నవనాథులు నడియాడిన గిరికి ప్రదక్షిణ చే సేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. హరిహరులు వెలసిన ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టకు కార్తీ క మాసంలో (మాస శివరాత్రి రోజున) అరుణాచలం తరహాలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆర్మూర్ పట్టణంలో సహజసిద్ధంగా ఏర్పడిన నల్లని రాళ్ల గుట్టపై స్వయంభూగా వెల సిన నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు వైభవంగా సప్త హారతి, గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన ప్రదక్షిణ చే యనున్నారు. నవనాథ సిద్ధులగుట్ట ఘా ట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న ఎల్లమ్మ మందిరం నుంచి ప్రదక్షిణ ప్రారంభం కా నుంది. ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అయోధ్య నుంచి తీసుకువచ్చిన నవనాథ సిద్ధేశ్వరుడి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించనుండగా.. ధో బీ ఘాట్, కాశీ హనుమాన్ వీధి, గోల్ బంగ్లా, పాత బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, ఘాట్ రోడ్డు మీదు గా సిద్ధుల గుట్టపైకి రథం చేరుతుంది. సుమారు మూడు కిలో మీటర్ల మేర భక్తులు, మహిళలు వేల సంఖ్యలో మంగళ హారతులతో వెంట రాగా శివనా మ స్మరణతో గిరిప్రదక్షిణ కొనసాగనుంది. గుట్టపై నవనాథ సిద్ధేశ్వరాలయంతోపాటు పురాతన రా మాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, హనుమాన్, అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. దీంతో గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఈ దేవుళ్లందరికీ గిరి ప్రదక్షిణ చేసినట్లుగా భావిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ప్రతినిధులు భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, జిమ్మి రవి, రామాగౌడ్, చరణ్‌రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్, సతీశ్, బట్టు శంకర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అరుణాచలం తరహాలో ఆర్మూర్‌లో
పదేళ్లుగా కార్తీక మాసంలో నిర్వహణ
సప్తహారతి, మంగళహారతుల వెలుగుల్లో మెరవనున్న సిద్ధుల గుట్ట
తరలిరానున్న వేలాది మంది భక్తులు
నవనాథ గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం


