న్యూస్‌రీల్
నిజామాబాద్
హైకోర్టు తీర్పును..
తెయూ అధికారులు హైకోర్టు తీర్పును
వెంటనే అమలు చేయాలని ఏఎఫ్‌ఐబీ నాయకుడు రాజుగౌడ్ డిమాండ్ చేశారు.
సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దే పాఠశాల ప్రాంగణంలో గంజాయి గుప్పుమంటోంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటూనే సమాజంలో బాధ్యత గల పౌరునిగా ఎదిగేది పాఠశాల స్థాయి నుంచే. కానీ కొందరి బాధ్యతారాహిత్యం విద్యార్థులను గంజాయికి బందీలను చేస్తోంది. జిల్లాలో ఇటీవల
కొందరు విద్యార్థుల వద్ద గంజాయి లభించడంతో అటు పోలీసులు, ఇటు అధికా రులు విస్తుపోయారు. గంజాయి నిర్మూలన, సేవించడంతో తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన కల్పించకపోవడం
ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిషేధిత గంజాయి జిల్లాలో రిటెయిల్ వ్యాపారంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల్లో మత్తెక్కించే గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. 2024 నవంబర్ 10 నుంచి 2025 నవంబర్ 10 వరకు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్‌లలో 107 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన నెలకు 8 నుంచి 9 కేసులు నమోదువుతున్నాయి. పసుపు నేలగా పేరొందిన ఆర్మూర్ డివిజన్‌లో వెలుగు చూసిన ఘటన కలకం రేపింది. ఓ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు సదరు విద్యార్థి గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారించడం డివిజన్‌లో కలకలం రేపింది. అధికారులు విచారణ చేపట్టడంతో మరికొందరు విద్యార్థుల వద్ద గంజాయి లభ్యమైంది. మరింత లోతుగా ఆరా తీయడంతో గ్రామంలోని కిరాణాదుకాణంలో గంజాయి రిటెయిల్‌గా లభ్యమవుతోందని తెలిసి అధికారులు విస్తపోయారు. కిరాణాదుకాణం నుంచే తాము గంజాయి కొనుగోలు చేసినట్లు విద్యార్థులు తెలపడం గమనార్హం. అదే మండలంలోని వివిధ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఒకరిని చూసి మరొకరు గంజాయికి బానిసలవుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు.
ఐదారేళ్ల నుంచే..
ఐదారేళ్ల క్రితం నుంచే జిల్లాలో గంజాయి విక్రయాలు రిటెయిల్ మార్కెట్‌లా మారిందని పలువురు అంటున్నారు. రెండేళ్ల క్రితం మాక్లూర్ మండలంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గంజాయి సేవించాలని అనడంతో అతడు నిరాకరించగా 9వ తరగతి విద్యార్థి అతడిని కొట్టాడు. దీంతో దెబ్బలుతిన్న విద్యార్థి తన తల్లికి చెప్పడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తనిఖీలు చేయగా ఆ పాఠశాలలోని మరికొందరు విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి లభ్యమైంది. ఇలాంటి ఘటనలు అడపాదడపా వెలుగులోకి వస్తున్నప్పటికీ వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి జాడ్యం ఇంతలా ఉంటే యంత్రాంగం తగిన విధంగా నిర్మూలన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తశుద్ధి ఏదీ..?
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు అనే మాటే లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఆ దిశగా చేస్తున్న కృషి అంతంతమాత్రంగానే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అడపాదడపా హైదరాబాద్‌లో దాడులు చేస్తూ డ్రగ్స్ నివారణకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ చిత్తశుద్ధి కనిపించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాల్లో మాత్రం విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో గంజాయి రిటెయిల్‌గా లభ్యమవుతోందనేది బహిరంగ రహస్యమే. ఈ విషయమై ప్రభుత్వం, యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో తగిన చొరవ చూపించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి బల్క్ రవాణా సైతం జిల్లాలో విపరీతంగా చోటుచేసుకుంటోంది. అడపాదడపా పట్టుబడుతున్నప్ప టికీ అది నామమాత్రమే. అధికారులకు పట్టుబడకుండా అత్యధిక గ్రామాలకు గంజాయి రవాణా అవుతుండడంపై జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి మత్తులో గ్రామీణ ప్రాంత విద్యార్థులు
రిటెయిల్‌గా విక్రయాలు
జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు
నిషేధిత మత్తు పదార్థాల
నిర్మూలన గాలికి
అవగాహన లేక బానిసలుగా
మారుతున్న స్టూడెంట్స్
భవిష్యత్‌కు పొగ
భవిష్యత్‌కు పొగ
భవిష్యత్‌కు పొగ


