
సంస్కరణలు కాదు.. భారీ ఊరట
సుభాష్‌నగర్: జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు కాదని.. దేశ ప్రజలకు భారీ ఊరట అని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని దేవీనవరాత్రుల కానుకు ఇచ్చారన్నారు. వాహన, ఎలక్ట్రా నిక్స్ షోరూములతోపాటు ఓ సూపర్ మార్కెట్‌ను ఎంపీ సందర్శించి జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన పోస్టర్లను పరిశీలించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. జీఎస్టీ తగ్గింపుతో అన్నిరకాల కార్ల ధరలు రూ.60 వేల నుంచి రూ.2లక్షల వరకు తగ్గడంతోపాటు ఇన్సురెన్స్, రోడ్డు ట్యాక్స్ సైతం తగ్గుతాయని తెలిపారు. ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్‌లపై జీరో జీఎస్టీ, స్టేషనరీ సహా 220 నిత్యావసర వస్తువుల ధరలపై 18శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గిందన్నారు. జీఎస్టీని తగ్గించడంతో జీడీపీ దాదా పు 1శాతం పెరిగే అవకాశముందన్నారు.
కాంగ్రెస్ ఏడుపు..
జీఎస్టీని తగ్గింపుతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్ ఏడుస్తోందని అర్వింద్ విమర్శించారు. జీ ఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేల కోట్లు నష్టం జరిగిందని సీఎం సహా మంత్రులు పేర్కొన డం సిగ్గుచేటన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యా లం రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాట్కూ రి తిరుపతిరెడ్డి, దిశా కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, లింగంపల్లి లింగం, హన్మంత్‌రావు పాల్గొన్నారు.
దేశ ప్రజలకు ప్రధాని మోదీ
నవరాత్రుల కానుక
జీఎస్టీ తగ్గింపుపై ఎంపీ అర్వింద్ ధర్మపురి
వాహన, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లతోపాటు సూపర్‌మార్కెట్ సందర్శన