
భక్తిశ్రద్ధలతో శ్రీ వారాహిదేవి పల్లకీ సేవ
సుభాష్‌నగర్ : నగరంలోని అమ్మనగర్‌లోగల శ్రీ వారాహి మాతా ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పంచలోహ నూతన విగ్రహాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి భక్తి భావంతో మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక శోభాయాత్రగా వారాహి మాతా ఆలయానికి తీసుకొచ్చారు. అర్చకులు వేలేటి పశుపతి శర్మ మంత్రోచ్చారణల మధ్య వారాహి అమ్మవారు వేంచేశారు. భవానీ మాలాధారులు, భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారి దివ్యదర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ శ్రీవారాహి దేవి ఆలయం ఇందూరులో భక్తి శ్రద్ధలకు కేంద్ర బిందువుగా అవతరించనుందని తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మంచాల శ్రీలక్ష్మి, భవానీ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు.