
ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం
నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా కబడ్డీ జట్ల శిక్షణ శిబిరం మంగళవారం ముగిసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికై న అండర్–16 బాలబాలికల జట్ల వివరాలను ప్రకటించారు. బాలుర కబడ్డీ టీం కోచ్ అన్వేష్, మేనేజర్ వినోద్, బాలికల కబడ్డీ టీమ్ కోచ్ సాయిలు, మేనేజర్ అనురాధ సమక్షంలో ఇట్టి క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ముప్కాల్ భుదేవ్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఇట్టి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.