
గ్రామ పాలన అధికారుల విధులివే..
మీకు తెలుసా?
సమాచారం..
కమ్మర్‌పల్లి: బ్యాంకులో ఖాతా తెరవాలంటే పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం మనం వాడుతున్న సెల్‌ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకొని, కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఈ–పాన్ కార్డు పొందవచ్చు.
మొదటగా గూగుల్‌లో ’ఈ–ఫిల్లింగ్ అని టైప్ చేయాలి. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హోమ్ పేజీలోకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ–పాన్ అనే ఐచ్చికాన్ని ఎంచుకొని ’గెట్ న్యూ పాన్ కార్డు’ అని నమోదు చేయాలి.
తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే జనరేట్ ఆధార్ ఓటీపీ అని సూచిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ నమోదు చేయగానే ఆధార్‌లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. సరి చూసుకుని అనుమతించాలి.
అనంతరం దరఖాస్తు చేసుకున్నట్లు అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ మన ఫోన్‌కు సందేశం వస్తుంది.
మళ్లీ మన విన్నపాన్ని ఆమోదించినట్లు కొద్ది గంటల్లోనే సందేశం వస్తుంది.
రాగానే ఈ–ఫైలింగ్‌లోనే మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్‌స్టంట్ ఈ–పాన్‌ని ఎంచుకోవాలి.
డౌన్లోడ్ ఈ–పాన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతోంది. ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ కార్డు ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.
ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే పుట్టినరోజు తేదీని ఎంటర్ చేస్తే పాన్‌కార్డు ఓపెన్ అవుతుంది.
రామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల క్లస్టర్ల వారీగా ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ పాలన అధికారిని నియమించింది. వారు నిర్వహించే విధుల వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామస్థాయిలో భూఖాతా(విలేజ్ ఎకౌంట్) నిర్వహణ.
పహాణీల నమోదు.
రెవెన్యూ మాతృదస్వరం నిర్వహణ
అన్ని రకాల భూముల నిర్వహణ మార్పులు, చేర్పులు.
లావుణీ అసైన్డ్, దేవాదాయ వర్క్స్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ.
ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి వనరుల కింద భూముల పరిరక్షణ.
అన్యాక్రాంతం, ఆక్రమణలపై చర్యలకు సహకరించడం.
భూమి ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పులు నమోదు.
భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందించడం.
ప్రకృతి విపత్తులు సంభవిస్తే నష్టం అంచనా.
గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం.