
బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రజట్టుకు ఇద్దరు జిల్లావాసుల ఎ
నిజామాబాద్ నాగారం: రాష్ట్ర సబ్ జూ నియర్ బాల్ బ్యాడ్మింటన్ జట్టులో ఇద్ద రు జిల్లావాసు లు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఎ. రీతిక (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిమ్మాపూర్), శ్రీరోహణ్ (ఉప్పల్‌వాయి) తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్రజట్టుతో కలసి ఈనెల 24 నుంచి 28 వరకు తమిళనాడు లో జరిగే 44వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను సంఘ ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల సభ్యులు అభినందించారు.

బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రజట్టుకు ఇద్దరు జిల్లావాసుల ఎ