
బ్రాహ్మణ కాలనీలో 30 తులాల బంగారం దొంగతనం
ఖలీల్‌వాడి: నాగారంలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ అనే అర్చకుడి ఇంట్లో చోరీ జరిగినట్లు నార్త్ సీఐ బూస శ్రీనివాస్ తెలిపారు. వివరాలు ఇలా.. బ్రాహ్మణకాలనీకి చెందిన పవన్ శర్మ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, పూజలు చేయడానికి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అతడు తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని లాకర్‌ను ధ్వంసం చేసి, అందులో ఉన్న 30 తులాల బంగారంను ఎత్తుకెళ్లారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.