
నిజామాబాద్‌కు కొత్త రైళ్లు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
● నగర రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల
పరిశీలన
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు త్వరలో మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్‌ను మంగళవారం మధ్యాహ్నం ఆయన, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతోకలిసి సందర్శించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. స్టేషన్‌లో మరో రెండు రైల్వే లైన్లు, రెండు ప్లాట్‌ఫామ్స్ పెరుగుతున్నట్లు చెప్పారు. కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల రాకపోకలు కూడా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: బాన్సువాడలోని లక్ష్మీనర్సింహ కల్యాణ మండపంలో ఈనెల 25న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతోపాటు సంఘం రాష్ట్రకమిటీ, రీజినల్ కమిటీ సభ్యులు తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి బాన్సువాడ డిపో పరిధిలోని ఆర్టీసీ కార్మికులతో పాటు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు హాజరై విజయవంతం చేయాలని సంఘ సభ్యులు కోరారు.