
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
నిజామాబాద్ సిటీ: వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్‌చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కోటగల్లీని ఎన్‌ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్ మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ధర్పల్లి, భీమ్‌గల్ మండలాల్లో పెద్దమొత్తంలో రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. ఈనెల 29న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.భూమన్న, నాగలక్ష్మి ,దేవేందర్ సింగ్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: మండలంలోని సర్పంచ్‌తండాకు చెందిన బాదావత్ జైపాల్‌నాయక్ రెండు రోజుల క్రితం వెలువడిన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఎస్టీ కోటాలో 342 ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈసందర్భంగా తండావాసులు, బంజార సేవ సంఘం నాయకులు పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన జైపాల్‌ను అభినందించారు.
సౌకర్యాలను
సద్వినియోగం చేసుకోవాలి
పెర్కిట్(ఆర్మూర్): విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసు కుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇటీవల నూతనంగా నిర్మించిన సైన్స్‌ల్యాబ్ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికకు అ నుగుణంగా విద్యార్థులు తమ దృక్పథాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పిప్రి కాంప్లెక్స్ హెచ్‌ఎం విశ్వనాథ్, హెచ్‌ఎంలు నవీన్, విజయ్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆనంద్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫుడ్ సైన్స్ కాలేజీలో
బతుకమ్మ సంబురాలు
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర విజ్ఞాన కాలేజీలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కాలేజీ ఆవరణ, వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని రంగురంగుల పువ్వులను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. పూజలు నిర్వహించి కళాశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. విద్యార్థునులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి