
బాలాత్రిపురసుందరిగా..
నగరంలో దేవిశరన్నవరాత్రి వేడుకలను ఆయా మండపాల నిర్వహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నగరంలో, గ్రామాల్లో దుర్గామాత బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. దుర్గాదేవి మండలపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండపం వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. నగరంలోని వినాయక్ నగర్‌లో 51 శక్తి పీఠాల రూపంలో దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌లో దుర్గామాత మండపం వద్ద భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.
నిజామాబాద్ రూరల్/డిచ్‌పల్లి
బెటాలియన్‌లో అమ్మవారికి
పూజలు చేస్తున్న సుహాసినులు