నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి టవర్స్‌లో మంగళవారం దేవీ నవరాత్రుల సందర్భంగా సకల దేవతల స్వరూపంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటుంది. సాయిటవర్స్‌కి చెందిన నిర్మల–రాముశర్మ దంపతులు ఏటా నవరాత్రుల్లో బొమ్మల కొలువును ఏర్పాటుచేస్తారు. శ్రీనివాసుని కల్యాణం, మహావిష్ణువు దశావతారాలు, దుర్గానవరాత్రుల ప్రత్యేక నవశక్తి రూపాలు ఇలా పదుల సంఖ్యలో పురాతన ఇతిహాస ఘటనలను తెలిపేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఇంటి ఆచారం, ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్టుమెట్టుగా బొమ్మలను అమర్చుతారు. ఇవి ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఈ బొమ్మల కొలువు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్