
పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలి
● జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: పాడి రైతులు పశువుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశు వైద్యాఽ దికారి రోహిత్ రెడ్డి అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అర్సపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 36 పశువులకు గర్భకోశ, 42 దూడలకు నట్టల నివారణ మందులు, 48 పశువులకు సాధారణ చికిత్సలు, మూడు పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబురావు, జిల్లా పశువైద్య ఆస్పత్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి, అర్సపల్లి సబ్‌సెంటర్ రమేశ్, వీఎల్‌వో శ్రీనివాస్, ఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, గోపాల మిత్రలు, ట్రెయినీ డాక్టర్లు పాల్గొన్నారు.