
విద్యుత్ షాక్‌తో ఇద్దరు..
కమ్మర్‌పల్లి: విద్యుత్ వైర్లను నీటిలో వేసి చేపలను వేటాడాలనుకున్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటన కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో నివాసముంటున్న కొండపల్లి లక్ష్మణ్(39), చిత్తారి నర్సింలు(30) కలిసి నేషనల్ హైవే పక్కన ఉన్న సౌటామోటా కాలువ కల్వర్టు వద్ద చేపలను వేటాడేందుకు వెళ్లారు. అయితే విద్యుత్ సహాయంతో చేపలను వేటాడలనుకున్న వారిద్దరు కాలువ వద్ద ఉన్న లో టెన్షన్ లైన్‌కు తీగను తగిలించే క్రమంలో 11 కేవీ లైన్‌కు తగిలి షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.
● కరెంట్ సాయంతో చేపలు వేటాడే ప్రయత్నం
● కమ్మర్‌పల్లి మండలంలో ఘటన