
రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి
చదువుతోనే భవిష్యత్తు
నిజామాబాద్ రూరల్: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని విద్యావేత్త, విశ్రాంత ఐఏఎస్, పూర్వ కలెక్టర్ డీ చక్రపాణి పేర్కొన్నారు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రామాలయంలో బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. విద్యార్థులు ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకోవాలని, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. అంతకు ముందు చక్రపాణిని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ వీరేశం, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.