
లండన్‌లో ఘనంగా గణేశ్ ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్ :లండన్‌లో ప్రవాస భారతీయులు వినాయక చవితి ఉత్సవాలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులు ఘనంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను పాటించాలన్నారు.వేలం పాటలో లడ్డూ ను రూ.3.60 లక్షలకు సికింద్రాబాద్ వారాసిగూడకి చెందిన వేదశ్రీ బాణాల దక్కించుకున్నారని, లక్కీ డ్రాలో ఐదు గ్రాముల గోల్డ్‌ను అఖిల్ బండి గెలుచుకున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సౌతాల్ మాజీ ఎంపీ.వీరేందర్ శర్మ, యూరప్ మహిళా అధ్యక్షురాలు,యూత్.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గురుమిందర్,కుమిలి ప్రెసిడెంట్ జాన్సన్ ఎడ్మన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.