డిచ్‌పల్లి: టీజీ సెర్ప్ ఉద్యోగుల సాధారణ బదిలీల నేపథ్యంలో డిచ్‌పల్లి మండల సమాఖ్య లో పనిచేసిన క్లస్టర్ కోఆర్డినేటర్లు (సీసీ)లు ఇతర మండలాలకు బదిలీపై వెళ్లగా వారి స్థానాల్లో బదిలీపై వచ్చిన సీసీ లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని 8 క్టసర్లలో సీసీ లు ఎస్.హరిబాబు (మెంట్రాజ్‌పల్లి క్లస్టర్), ఎ.అశోక్ (సుద్దపల్లి), కే.సురేశ్ (రాంపూర్), కే.శ్రీధర్‌రెడ్డి (ఘన్‌పూర్), బి.గోవింద్ (మిట్టపల్లి), ఎస్.హరి (డిచ్‌పల్లి), ఎం.ఆరోగ్యరాణి (యానంపల్లి), టి.గిరీష్ కుమార్ (ధర్మారం(బి) క్లస్టర్) వీరు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీఎం రవీందర్‌రెడ్డిని సీసీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సక్రమంగా అందేలా కృషి చేయాలని ఏపీఎం సూచించారు.