
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : మాజీ ఎమ్మెల్సీ అరికెల న
సిరికొండ:మండలంలో వరదలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపా రు. మండలంలోని కొండూర్ గ్రామంలో వరద బా ధితులను ఆయన సోమవారం పరామర్శించారు. వరద తాకిడికి కూలిపోయిన ఇళ్లను, కప్పలవాగు వంతెన, రోడ్డును పరిశీలించారు. బాధితులకు 200 మందికి పది కిలోల బియ్యం, దుప్పట్లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లడం జరిగిందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రవి, బండారి నరేష్, రాజారెడ్డి, గర్గుల రాములు, సదానంద్‌రెడ్డి, పురుషోత్తం, పుప్పాల రవి, దేగాం సాయన్న, దేవేందర్, బాలనర్సయ్య, చెలిమెల నర్సయ్య, కోచర్ గంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేందర్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలం వాడి, నడిమి తండా, బీరప్ప తండాలో వరద బాధితులను మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం వాడి గ్రామంలో వరద బాధిత కుటుంబాలకు ఆయన నిత్యవసర సరుకులను పంపిణీతో పాటు దుప్పట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ బాలరాజ్, చెలిమిల నరసయ్య, సుభాష్, సురేందర్ గౌడ్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.