
సబ్సిడీపై సంచార వాహనాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్‌హెచ్‌జీ మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలందించి ఆర్థిక తోడ్పాటునందిస్తుండగా.. మ హిళాశక్తి కార్యక్రమం కింద సంచార చేపల విక్రయ వాహనాలను 60శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు యూనిట్లు ప్ర భుత్వం మంజూరు చేసింది. ఈ నెల 1వ తేదీన హైదరాబాద్‌లో మంత్రి సీతక్క లబ్ధిదారులకు వా హనాలను అప్పగించారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్‌కు చెందిన తొండాకూర్ లావణ్య, నిజామాబా ద్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుబ్బా క గంగామణి వాహనాలు పొందిన వారిలో ఉన్నా రు. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.6లక్షలు సబ్సిడీ పోను మిగతా రూ.4 లక్షలు లబ్ధిదారులు చెల్లించారు. లబ్ధిదారుల వాటా డబ్బులకు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ రు ణం అందజేసింది. ఈ సంచార చేపల విక్రయ వా హనాలను నియోజకవర్గానికి ఒకటి అందజేసి, దశ ల వారీగా మండలాల్లో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు.
వాహనంతో వ్యాపారం..
ఎస్‌హెచ్‌జీ మహిళలు వ్యాపారం కోసం ఉపయోగించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది. చేపల రవాణాతోపాటు రోడ్‌సైడ్ బిజినెస్ చేసుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు ఇందులో సమకూర్చింది. చేప ల ఫ్రై, కూరలు వండి విక్రయించేందుకు ప్రత్యేకంగా కిచెన్ కిట్, ఫ్రిడ్జ్, వాటర్, ఐస్ బాక్సులు, ఇన్వర్టర్‌తో విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. వ్యాపారంలో నై పుణ్యం పొందేందుకు మహిళలకు శిక్షణ కూడా ఇ స్తున్నారు. సంచార వాహనాలు కావాలనుకునే ఎస్‌హెచ్‌జీ మహిళలు ఐకేపీకి సంబంధించిన మండల, జిల్లా కార్యాల యాల్లో అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ కోరారు.
ఎస్‌హెచ్‌జీ మహిళలకు
అందిస్తున్న ప్రభుత్వం
తొలి విడతగా జిల్లాలో ఇద్దరికి..
దశల వారీగా మంజూరు
చేసేందుకు ప్రణాళిక